రాబర్ట్ వాద్రాపై పిటిషన్ తిరస్కరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాబర్ట్ వాద్రాపై పిటిషన్ తిరస్కరణ

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూవ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. హర్యానాలోని వాద్రా సంస్థలకు వ్యవసాయ భూమిని అమ్మడం, ఆ వ్యవసాయ భూమిని ప్లాట్లుగానూ, కాలనీలుగానూ మార్చేందుకు బిల్డర్లు, డెవలపర్లకు లైసెన్సులు మంజూరు చేయడంపై కూడా పూర్తి దర్యాప్తు జరగాలని పిటిషనర్ కోరారు. ఈ క్రమంలో రూ.20,000 కోట్ల కుంభకోణం జరిగిందని... మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం ఆరోపణల కింద సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేయడంతో వాద్రాకు ఈ విషయంలో ఉపశమనం కలిగింది.

More Telugu News