దొంగలపాలిట కల్పతరువుల్లా మారుతున్న ఆన్ లైన్ మార్కెట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దొంగలపాలిట కల్పతరువుల్లా మారుతున్న ఆన్ లైన్ మార్కెట్లు

'మీరేదైనా వస్తువును అమ్మాలనుకుంటున్నారా? అయితే, మా సైట్లో మీ వస్తువుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేయండి... చిటికెలో అమ్ముకోండి!' అంటూ ఇంటర్నెట్లో ప్రకటనలను చూస్తుంటాం. ఆన్ లైన్ ట్రేడింగ్ సైట్లు ఇచ్చే ప్రకటనలు ఇలానే ఉంటాయి. అయితే, ఈ మార్కెట్లో ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులకు బదులు... చోరీకి గురైన వస్తువులు దర్శనమిస్తున్నాయట. దొంగలు ఇప్పుడు తాము చోరీ చేసిన వస్తువులను షాపుల్లో అమ్మకుండా, ఇలా, ఆన్ లైన్ లో పెట్టేసి ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారని చత్తీస్ గఢ్ పోలీసులు చెబుతున్నారు. చోరీ చేసిన మొబైళ్ళ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వారు ఓఎల్ఎక్స్.ఇన్ వంటి ఆన్ లైన్ ట్రేడింగ్ సైట్లలో అమ్మకానికి పెడుతున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

More Telugu News