శ్వేతాబసు... మంచి అభిరుచి ఉన్న వ్యక్తి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్వేతాబసు... మంచి అభిరుచి ఉన్న వ్యక్తి!

బాలనటిగా కెరీర్ ఆరంభించి, మంచి హీరోయిన్ గా ఎదిగిన శ్వేతాబసు ప్రసాద్ జీవిత ప్రస్థానంలో ఇటీవల కొన్ని ఘటనలు చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. వ్యభిచారం కేసులో అరెస్టు కావడం, ఆపై ఆమెను కోర్టు రెస్క్యూ హోంకు తరలించడం తెలిసిందే. కానీ, శ్వేతాబసు గురించి ఇప్పటివరకు పెద్దగా తెలియని విషయం ఏమిటంటే... ఆమె సాహితీప్రియురాలు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్షియన్ కవి జలాలుద్దీన్ మహ్మద్ రూమీ రచనలను ఆమె ఇష్టంగా చదువుతుంది. మరణం తర్వాత మనిషి బతకాల్సింది సమాధిలో కాదని, మనుషుల హృదయాల్లో అన్న రూమీ భావజాలం శ్వేతను విశేషంగా ఆకర్షించింది. అన్నట్టు... ఈ వర్ధమాన నటి మంచి ఫొటోగ్రాఫర్ కూడా. పేదరికం, సమాజంలోని ఇతర అంశాలు, ప్రకృతి... ఇలా తనను కదిలించిన ప్రతి అంశాన్ని కెమెరాలో బంధించడం శ్వేతాబసుకు అలవాటు. అలా తీసిన ఫొటోలతో రూమీ జన్మదినోత్సవం నాడు ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కూడా. కానీ, ఇంత మంచి అభిరుచులున్న శ్వేతాబసు జీవితం పక్కదారి పట్టడం నిజంగా దురదృష్టకరం.

More Telugu News