తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫాస్ట్' పథకంపై జారీ చేసిన జీవోపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ మేరకు ఫాస్ట్ జీవోను కొట్టి వేయాలని పిటిషన్ లో కోరారు. ఫాస్ట్ పథకంతో తెలంగాణలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకే ఫీజు చెల్లిస్తామంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు 36ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని డొక్కా కోరారు.
రాజ్యాంగం ప్రకారం విద్య, ఉద్యోగాల్లో సమానావకాశాలు కల్పించాల్సిన అవసరముందని వివరించారు. అలాగే విద్యార్థులకు ఫీజులు చెల్లించే ఫీజు రీయింబర్స్ మెంట్, ప్రవేశాల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే అనుసరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యం వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి