తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులని 'మర్యాదరామన్న'లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. నయా పోలీసింగ్ లో భాగంగా ఇప్పటికే వేలసంఖ్యలో కొత్త వాహనాలు, వందల సంఖ్యలో నూతన నియామకాలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే, పోలీసుల ప్రవర్తనలో కూడా సమూలమార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు హోంశాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ నగరం కీలకం కానుంది. హైదరాబాద్ లో పనిచేసే పోలీసుల పనితీరు విదేశీ సంస్థలు, వారి ప్రతినిధులపై పడతుండడంతో... ముందుగా హైదరాబాద్ పోలీసుల నోటిదురుసును తగ్గించేందుకు హోంశాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా హైదరాబాద్ పోలీసులకు 'మర్యాద పాఠాలు' నేర్పేందుకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని అధికారులు నిశ్చయించుకున్నారు. నగరంలోని సామాన్య పౌరుల పట్ల ఎలా ప్రవర్తించాలి... స్టేషన్ కు వచ్చినవారితో మర్యాదగా ఎలా మాట్లాడాలి... బాడీలాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలనే దానిపై సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్ ఫర్ట్స్ తో శిక్షణ ఇప్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ నెలలో ప్రారంభించనున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు