గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత్ కు రెండు రజత పతకాలు లభించాయి. ఫైనల్ పోరులో భారత క్రీడాకారిణులు చతికిలబడటంతో రజతపతకాలతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. భారత క్రీడాకారిణి లైష్ రాందేవి ఆస్ట్రేలియాకు చెందిన వాట్స్ చేతిలో ఓడి రజత పతకం సొంతం చేసుకోగా, మహిళల 50-60 కేజీల బాక్సింగ్ విభాగంలో సరితా దేవి రజత పతకం సాధించింది.