ఎక్స్ ప్రెస్ బస్సులను సూపర్ ఫాస్ట్ బస్సులుగా మార్చి ఆర్టీసీ ఆదాయం చేసుకుంటుంటే, అందుకు భిన్నంగా ముణుగూరు సూపర్ ఫాస్ట్ రైలును ఎక్స్ ప్రెస్ రైలుగా మార్చి ఆదాయం పెంచుకునేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వరకు, సికింద్రాబాద్ నుంచి మణుగూరు వరకు రాకపోకలు సాగిస్తున్న సూపర్ ఫాస్ట్ రైలును ఎక్స్ ప్రెస్ రైలుగా మారుస్తున్నట్టు భద్రాచంలం రోడ్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.
రైలు స్థాయితో పాటు రైలు బండి నెంబర్ కూడా మారింది. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు నెంబర్ గతంలో 12751గా వుండగా, ఇప్పుడు దీనిని 17025 గా మార్చారు. అలాగే సికింద్రాబాద్ నుంచి మణుగూరు వచ్చే రైలు నెంబర్ 12752 ఉండగా, దానిని 17026 గా మార్చినట్టు అధికారులు వెల్లడించారు. సూపర్ ఫాస్ట్ ను ఎక్స్ ప్రెస్ చేయడంతో ప్రయాణ ఛార్జీలు 15 శాతం తగ్గి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి