అఫిడవిట్లు, గెజిటెడ్ అధికారుల సంతకాలకు స్వస్తి పలుకుతున్న కేంద్రం

02-08-2014 Sat 09:38
ఎన్నో రకాల కార్యకలాపాలకు అఫిడవిట్లు, గెజిటెడ్ అధికారుల ధృవీకరణ సంతకాలు కలిగిన పత్రాలను సమర్పించే సంప్రదాయం ఇప్పటిదాకా ఉంది. ఈ పద్ధతికి కేంద్ర ప్రభుత్వం మంగళం పలుకుతోంది. ఎవరికి వారే ధృవీకరణ పత్రాలను సమర్పించే పద్ధతిని అమలు చేసే దిశగా ప్రధాని మోడీ అడుగు వేశారు. అయితే, ఇలా స్వయంగా పత్రాలను సమర్పించే విషయంలో అవకతవకలకు పాల్పడితే పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ల కింద నేరుగా కేసు నమోదు చేస్తారు. అఫిడవిట్ల వాడకాన్ని సాధ్యమైనంత తక్కువ చేయాలని, ఆయా వ్యక్తులు స్వయంగా అందించే పత్రాలనే స్వీకరించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు ఇప్పటికే సూచనలు అందాయి. స్వయంగా ధృవీకరణ పత్రాలను అందజేసినవారు... చివరి దశలో ఒరిజినల్స్ చూపిస్తే సరిపోతుంది. ఈ విషయం వల్ల సామాన్యులకు చాలా మేలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. అఫిడవిట్లు, గెజిటెడ్ అధికారుల సంతకాల కోసం సామాన్యులకు బోలెడంత సమయం వృథా కావడమే కాకుండా... డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి తోడు అధికారుల సమయాన్ని కూడా ఈ పద్ధతి వృథా చేస్తోంది. అందుకే, ఈ పద్ధతికి మంగళం పలికేందుకు కేంద్రం సిద్ధమైంది.

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more