ఏడు కొండలపై కొలువైన తిరుమలేశుడు నిజంగా ‘బంగారు కొండే’. శ్రీవారికి నిత్యం భక్తులు నగదుతో పాటు బంగారాన్ని సమర్పిస్తూనే ఉన్నారు. అయితే, స్వామివారికి ఉన్న బంగారానికి లెక్కే లేదు. 2009లో శ్రీ వేంకటేశ్వరస్వామి బంగారం లెక్కలపై కాంగ్రెస్ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, శ్రీనివాసుడి ఆస్తులపై అప్పటి పాలక మండలి సరైన లెక్కలను చూపించలేకపోయింది. శ్రీవారికి నిత్యం అలంకారానికి బంగారు ఆభరణాలను వినియోగిస్తున్నారు. వినియోగంలో లేని బంగారు నగలను టీటీడీ బ్యాంకుల్లో భద్రపరుస్తోంది. అందుకోసం స్టేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకుల్లో ఖాతాలను తెరిచింది. ఐదేళ్ల కాలానికి వంద కిలోల బంగారానికి వడ్డీ రూపేణా కిలో బంగారాన్ని ఇవ్వాలన్న షరతుపై బ్యాంకుల్లో టీటీడీ బంగారాన్ని భద్రపరిచింది.
ఏడుకొండలవాడికి ఉన్న 5 వేల కిలోల బంగారానికి... అలా వడ్డీగా 50 కిలోల బంగారాన్ని బ్యాంకులు జమ చేస్తున్నాయి. అలా, ఇప్పటి వరకు స్వామివారి బంగారం మొత్తం 6,800 కిలోలకు చేరిందని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బంగారం విలువ 2010 నాటికి 60 వేల కోట్ల రూపాయలు కాగా... అనంతరం భక్తులు సమర్పించిన బంగారంతో కలిపి ఆ విలువ ప్రస్తుతం 72 వేల కోట్ల రూపాయల పైమాటే. భక్తులు ప్రతిరోజూ సమర్పించే బంగారాన్ని ప్రతి శనివారం టీటీడీ స్టేట్ బ్యాంకులో జమ చేస్తోంది. అలా శ్రీవారికి ఆస్తుల చిట్టా రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. అందుకే కలియుగ దైవమైన శ్రీనివాసుడు... వేంకటేశ్వరుడు... తిరుమల గిరీశుడు... నిజంగా ‘బంగారు కొండ’.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు