ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఇవాళ ఏపీ కేబినేట్ భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి మీడియాకు వివరించారు. అక్టోబరు 2 నుంచి గృహాలకు, పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్తును ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఏపీలో ‘అన్న క్యాంటీన్’ లను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్న క్యాంటీన్ అమలుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కొత్త ఐటీ పాలసీని రూపొందించామని, 5 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే ఐటీ ప్రాజెక్టులకు 60 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో ఉద్యోగికి రూ.60 వేల చొప్పున రాయితీని అందించాలని ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐటీ కంపెనీలను నెలకొల్పే మహిళలు, ఎస్టీ, ఎస్సీలకు మరింత ప్రయోజనకరంగా రాయితీలు అందిస్తామన్నారు. ఐటీ కంపెనీలకు విద్యుత్ ఛార్జీల్లో 25 శాతం రాయితీని అందిస్తామని ఆయన చెప్పారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి