దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గగా, డీజిల్ ధరలు కొంచెం పెరిగాయి. పెరిగిన ధరలను గురువారం అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.1.41 పైసలు తగ్గగా, డీజిల్ లీటర్‌కు 62 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో పాటు, డాలర్‌తో రూపాయి విలువ పెరగడంతో... క్రూడాయిల్ దిగుమతి ధరలు తగ్గాయి. దీంతో పెట్రోల్ ధరను ఆయిల్ కంపెనీలు ఓ మోస్తరుగా తగ్గించాయి. ప్రతీ నెల 1, 16 తారీఖుల్లో అంతర్జాతీయ ముడిచమురు రేట్లు, రూపాయి మారకం విలువను అంచానా వేసుకుని... చమురు సంస్థలు పెట్రోల్ ధరలను సవరిస్తాయి. మూడున్నర నెలల్లో పెట్రోల్ ధరలు తగ్గడం ఇది రెండోసారి.
అంతర్జాతీయంగా డీజిల్ ధరలు తగ్గినప్పటికీ... భారత్ లో మాత్రం కాస్త పెరగడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. డీజిల్ విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం జనవరి 2013లో తెచ్చిన విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా ఫాలో అవుతోంది. ఈ విధానం ప్రకారం డీజిల్ ఇంధనం అమ్మకం ద్వారా ఆయిల్ కంపెనీలకు వాటిల్లే నష్టం పూర్తిగా తొలిగిపోయే వరకూ... నెలకు లీటర్ కు 50 పైసల మేర ఆయిల్ కంపెనీలు పెంచుతాయి. నిన్నటివరకు లీటర్ డీజిల్ అమ్మకం ద్వారా ఆయిల్ కంపెనీలు రూ.1.83 మేరకు నష్టపోయేవి. తాజాగా డీజిల్ ధరను 62 పైసలు పెంచిన తర్వాత కూడా లీటర్ కు రూ.1.33 మేర నష్టపోతున్నామని చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ ప్రకారం డీజిల్ ధరను మార్కెట్ విలువకు తీసుకురావడానికి వచ్చే మూడునెలల్లో మూడుసార్లు పెంచే అవకాశం ఉంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు