నూట ఇరవై కోట్ల భారతావనిలో క్రికెట్ కు తప్ప ఇతర క్రీడలకు అంత ఆదరణ లభించడం లేదు. ఆటాడితే ఏమొస్తుందిలే అనే తల్లిదండ్రులు కూడా, ఆటలాడితే మంచి ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతులు, కోరినంత డబ్బు వస్తుందని ఇప్పుడు గుర్తిస్తున్నారు. మరోవైపు సినిమాల తరువాత అత్యధికంగా వ్యాపారం చేసేది ఆటలేనని వ్యాపార వేత్తలు గుర్తించారు. అందుకు సేవకు సేవ, వ్యాపారానికి వ్యాపారం ఉండేలా క్రీడల ప్రాచుర్యానికి నడుం బిగిస్తున్నారు. తాజాగా మన రాష్ట్ర క్రీడ కబడ్డీకి ప్రాచుర్యం కల్పించేందుకు సల్మాన్ ఖాన్ నడుం బిగించాడు.
బాలీవుడ్ మాస్ మహరాజా సల్మాన్ కబడ్డీ ప్రోమోల్లో నటించి ఆదరణ కల్పించాడు. కాగా ఐపీఎల్ తరహాలో ప్రో కబడ్డీ లీగ్ అని 8 జట్లతో ఓ లీగ్ ప్రారంభమైంది. దీని ప్రారంభోత్సవానికి బాలీవుడ్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, జయబాదురి, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ లతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరై సందడి చేశారు. ఈ టోర్నీలో ఢిల్లీ, ముంబై, జైపూర్, పాట్నా, పూణే, కోల్ కతా, బెంగళూరు, వైజాగ్ జట్లు పోటీ పడుతున్నాయి. జైపూర్ పింక్ పాంధర్స్ జట్టును అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేయడంతో బాలీవుడ్ సినీనటులంతా హాజరయ్యారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి