Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది: చంద్రబాబు

2312 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉంటే... వాటిని తగ్గించేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోషల్ వెల్పేర్ హాస్టల్స్ కు పిల్లలు రాకుండా చేశారన్నారు. ఎవరైనా హాస్టల్స్ కు వచ్చినా, అక్కడ ఉండే పరిస్థితి లేదన్నారు. హైదరాబాదులో ఇవాళ మానవ వనరుల శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్ సీ సబ్ ప్లాన్ కు కేటాయించిన సొమ్మును ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. 2011 నుంచి బీసీ కమీషన్ ఖాళీగా ఉందన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. పిల్లలను బాల కార్మికులుగా మార్చేందుకు వీల్లేదని, చదువుకునే వయస్సున్న పిల్లలందరి వివరాలను కంప్యూటరైజ్డ్ చేస్తామని చంద్రబాబు చెప్పారు. పిల్లల్లో చదువు పైన మక్కువ పెంచేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

More Telugu News