‘పొరుగింటి పుల్ల కూర రుచి’... ఈ సంగతి భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇంపోర్టెడ్ వస్తువులతో పాటు, ఇంపోర్టెడ్ సంస్కృతి, సంప్రదాయం, ఆలోచనలు, బంధాలు... ఇలా అన్నీ ధనికంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే పురాతన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న అనేక అంశాలు భారతీయుల కంటే విదేశీయులకే బాగా అర్థమవుతున్నాయి.
అందుకే మనకి అక్కరకు రాని ఆయుర్వేదం, నేచురోపతి వంటి వైద్యవిధానాలు విదేశీయులు అనుసరిస్తుండగా ఇంపోర్ట్ చేసుకున్న ఇంగ్లిష్ మందులను మనం వాడుతూ ఆసుపత్రులకు వేలకు వేలు వెచ్చిస్తున్నాము. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, శృంగార ఔషధం మనదేశంలో... అందునా మనరాష్ట్రంలో విరివిగా లభిస్తుందని ఎంత మందికి తెలుసు? దానిని స్మగ్లింగ్ చేసే వారికి కూడా అందులో ఔషధ గుణాలున్నాయని తెలిసి ఉండకపోవచ్చు.
ఇండియాలో దొరుకుతోంది... దానికి విదేశాల్లో గిరాకీ ఉంది. అందుకే దానిని స్మగ్లింగ్ చేస్తున్నారు, అదీ విశేషం. కాకపోతే ఎర్రచందనం గుణగణాలు తెలిసిన చైనా, జపాన్ వంటి దేశాల వారు ఎంత ఖర్చు చేసైనా ఎర్రచందనం కొని, వాడటానికి వెనుకాడడం లేదు. ఎర్ర చందనానికి ఔషధ గుణాలతో పాటు శృంగార సామర్థ్యం పెంచే శక్తి కూడా ఉంది. ఎర్రచందనం పౌడర్ రోజుకు 5 గ్రాముల చొప్పున పాలల్లో కానీ, తేనెలో కానీ కలుపుకుని పడుకోవడానికి ఒక గంట ముందు తీసుకుంటే శరీరంలో లైంగిక హార్మోన్లు ఉత్పత్తి పెరిగి సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
చైనా, జపాన్ లో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం ఉండాల్సిందే. పెళ్లి చేసుకునే యువకుడు పెళ్లికుమార్తెకు షామిచాన్ అనే వాయిద్యాన్ని విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వాయిద్యం ఎర్రచందనంతో తయారవుతుంది. దీని తయారీకి తక్కువలో తక్కువ రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇందు కోసం చైనా, జపాన్ లో ఏటా 8లక్షల టన్నుల ఎర్రచందనం మన దేశం (రాష్ట్రం) నుంచి అడ్డదారుల్లో దిగుమతి చేసుకుంటున్నారు. ఎర్రచందనానికి అంత డిమాండ్ ఉండబట్టే ఎర్రచందనం స్మగ్లర్లు కోట్లకి పడగలెత్తుతున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు