Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జడేజా జరిమానాపై... న్యాయపోరాటానికి దిగిన బీసీసీఐ

భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకు మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాపై బీసీసీఐ న్యాయపోరాటానికి సిద్ధమైంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ అండర్సన్‌తో జడేజాకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదంలో జడేజాకు మ్యాచ్‌ రెఫరీ డేవిడ్‌ బూన్‌ లెవల్‌-1 తప్పిదం కింద మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. ఈ తీర్పుపై జ్యుడీషియల్‌ కమిషనర్‌ గోర్డాన్‌ లెవిస్‌కు బీసీసీఐ అప్పీల్‌ చేసుకుంది. ఇండియన్ టీం కెప్టెన్‌ ధోనీ కూడా జడేజాకు విధించిన జరిమానాపై బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అండర్సన్ పై విచారణ జరిగే ఆగస్ట్ 1నే జడేజా అప్పీలుపై కూడా విచారణ జరుగుతుందని ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

More Telugu News