ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలకు మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేసి ఏపీలో జిల్లాల సంఖ్యను 14కు పెంచాలని ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ఏపీలో కలిసిన ఖమ్మంలోని ఏడు మండలాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాలు, తూర్పు గోదావరిలోని 10 మండలాలు కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. 14వ జిల్లా ఏర్పాటు చేయడానికి ఏపీ సర్కార్ రెండు ప్రధాన కారణాలు చెబుతోంది. ఆ రెండు కారణాలు ఏంటంటే....
మొదటికారణం: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో... నాలుగు మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో, మూడు మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలపాలని ముందు అనుకున్నారు. అయితే ఇలా కలపడం వల్ల ఆ ఏడు మండలాలు... ఆ జిల్లా కేంద్రాలైన కాకినాడ, ఏలూరులకు చాలా దూరంలో ఉంటాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలు కూడా ఇప్పటికే ఆ జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్నాయి.
జిల్లా ప్రధాన కేంద్రం దూరంగా ఉండడం వల్ల ఈ రెండు జిల్లాల్లోని గిరిజనులు బాగా ఇబ్బందిపడుతున్నారు. అందుకే ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను కలిపి ఓ కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి ఏపీ సర్కార్ వచ్చింది. ఈ జిల్లా ఏర్పాటుతో గిరిజన ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్న ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.
రెండో కారణం: 13 సంఖ్యను ఏపీ ప్రభుత్వం కీడుకు సంకేతంగా భావిస్తోంది. ఈ సంఖ్య రాష్ట్రానికి ఏమాత్రం అచ్చిరాదని ఏపీ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పశ్చిమదేశాల్లో కూడా వారి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కడా 13 వ సంఖ్యను వాడరు. 13 సంఖ్యను వారు అశుభంగా భావిస్తారు. ఈ కారణంగా కూడా ఏపీలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తోంది.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి