భారత నూతన సైన్యాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. గత మే నెలలో యూపీఏ ప్రభుత్వం దల్బీర్ సింగ్ ను ఆర్మీ చీఫ్ గా నియమించింది. జనరల్ బిక్రం సింగ్ పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా... ఆయన స్థానంలో దల్బీర్ బాధ్యతలు స్వీకరిస్తారు.