ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ తో తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించామని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలకు కౌన్సిలింగ్ కు అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తామే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. నాణ్యమైన విద్య విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని ఆయన చెప్పారు. గతంలో అక్టోబరులో కూడా తరగతులు ప్రారంభమైన సందర్భాలున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు సృష్టిస్తోన్న గందరగోళంలో ఎవరూ పడవద్దని జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫాస్ట్ అమలుపై ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్లు ఆయన చెప్పారు. ఏ విద్యామండలి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఆంధ్రా ప్రజలను కూడా మోసం చేస్తున్నారన్నారు. ఏపీ నుంచి విద్యామండలికి ఎలాంటి అనుమతి రాలేదన్నారు. కౌన్సిలింగ్ ను పూర్తి చేయాలన్న సంకల్పం ఏపీ సర్కారుకు లేదని జగదీశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో సీట్లు ఇచ్చే అధికారం ఆంధ్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు