‘పిట్ట కొంచెం - కూత ఘనం’ అంటే ఈ బుడ్డోడికి సరిగ్గా సరిపోతుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం రాజులగూడకు చెందిన ఎనిమిదవ తరగతి కుర్రాడు జాదవ్ సాయికిరణ్ ప్రయోగాల్లో రాణిస్తూ అందర్నీ అబ్బురపరుస్తున్నాడు. ఆటలాడుకునే వయసులో ఆటవస్తువులతో ప్రయోగాలు చేసి ఔరా అనిపిస్తున్నాడు. తండ్రి మరణించడంతో అమ్మమ్మ ఇంట్లో చేరిన సాయికిరణ్ తల్లి చిన్న కిరాణా దుకాణం నడుపుతోంది. ఆమె తెచ్చి ఇచ్చే ఆటబొమ్మల్లోని మోటార్లతో సాయికిరణ్ వాటర్ హీటర్, మిక్సీ తయారు చేశాడు.
ఓ రేకు తీసుకుని సగం విరగ్గొట్టాడు. దానికి రెండు రంధ్రాలు చేశాడు. ఈ రంధ్రాలకు రెండు విద్యుత్ వైర్లను అమర్చాడు. వాటిని రెండు బ్యాటరీలకు కనెక్షన్ ఇచ్చాడు. వైర్ల ద్వారా విద్యుత్ ప్రవహించి రేకు వేడెక్కి నీటిని వేడి చేస్తుంది. అలాగే ఓ డబ్బా తీసుకుని దానికి రంధ్రం చేశాడు. ఆ రంధ్రానికి బ్లేడ్లు అమర్చి వాటికి ఆటవస్తువులకు వాడే మోటారుతో కనెక్షన్ ఇచ్చాడు. వాటిని బ్యాటరీలకు కలిపితే మిక్సీలా పనిచేస్తుంది. ఈ సరికొత్త మిక్సీ అరకిలో ధనియాలను పొడి చేయడం విశేషం!
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు