ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. ఆగస్టు 7వ తేదీలోగా ఆధార్ నమోదును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిత్యావసర వస్తువుల సరఫరా, రుణమాఫీ తదితర పథకాలకు ఆధార్ అవసరమని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 11 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులుండగా, 2.5 లక్షల మంది గులాబీ కార్డుదారులున్నారు. వీరందరూ ఆధార్ కార్డుల నమోదుతోపాటు సెల్ ఫోన్ నెంబర్లను నమోదు చేయించుకోవాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది. జిల్లాలో మొత్తం 35 లక్షల యూనిక్ నెంబర్లకు గాను... ఇప్పటికే 29 లక్షల యూనిక్ నెంబర్ల నమోదును పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆధార్ కార్డు కాకుండా, వేరే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని భావిస్తున్నారు. ఫించన్లు, స్కాలర్ షిప్పులు తదితర పథకాలకు ఈ సరికొత్త టెక్నాలజీని వాడాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డులను ముడిపెట్టవద్దంటూ సూచించటంతో చాలా మంది ఆధార్ కార్డు నమోదుకు ముందుకు రావడం లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ నమోదు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మున్ముందు ప్రభుత్వ పథకాల అమలుకు ఆధార్ కీలకం కానున్నదని కేంద్రం పేర్కొంది. దీంతో ఆయా ప్రభుత్వ పథకాల కోసం ‘ఆధార్’ ఆధారమని తేలిపోయింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు