మాంసాల్లోకెల్లా కోడిమాంసం రుచే వేరు. మటన్ తో పోల్చితే రేటు తక్కువ కావడంతో మాంసాహార ప్రియులు కోడికే తమ ఓటేస్తారు. కానీ, ఆ కోడిమాంసం సురక్షితమైనదేనా? అంటే, కాదంటున్నారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) పరిశోధకులు. మనం తినే చికెన్ లో యాంటిబయాటిక్స్ అవశేషాలు 40 శాతం మేర ఉంటాయని చెబుతున్నారు. సీఎస్ఈకి చెందిన పొల్యూషన్ మానిటరింగ్ లేబొరేటరీ (పీఎంఎల్) కోడిమాంసం శాంపిళ్ళపై పరిశోధనలు చేపట్టింది.
పౌల్ట్రీ పరిశ్రమలో యాంటిబయాటిక్స్ విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని సీఎస్ఈ పేర్కొంది. త్వరగా ఎదిగేందుకు, స్వల్ప కాలంలోనే బరువు పెరిగేందుకు కోళ్ళకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం పరిపాటిగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా కోళ్ళలో బ్యాక్టీరియా యాంటీబయాటిక్ నిరోధకతను సంతరించుకుంటాయట. ఆ మొండి బ్యాక్టీరియా కోళ్ళ నుంచి మనుషులకు సంక్రమిస్తాయని, తద్వారా ప్రమాదకర వ్యాధులు కోరి తెచ్చుకున్నట్టేనని సీఎస్ఈ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించినప్పుడే చికెన్ సురక్షితమైనదిగా భావించాల్సి ఉంటుందని సీఎస్ఈ చెబుతోంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు