పుట్టినవాడు మరణించక తప్పదు... మరణించినవాడు జన్మించక తప్పదు అంటూ కురుక్షేత్ర యుద్ధం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. అలాగే చెన్నైలోని ఓ మహిళ మరణించి తిరిగి జన్మించకుండానే పునర్జన్మ పొందింది. ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. చెన్నైలోని పాడి ప్రాంతానికి చెందిన వివాహిత ఎల్.షీబా పాత మహాబలిపురం రోడ్డు (ఓఎమ్ఆర్)లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
ఈనెల 27న విధులను ముగించుకుని ద్విచక్రవాహనంపై వస్తుండగా, సాయంత్రం 5.30 గంటల సమయంలో అశోక్‌నగర్ పిల్లర్ వద్ద మరో బైక్ ను ఢీకొంది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమె బ్రెయిన్‌డెడ్ అయి కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని వైద్యులు ఆమె బంధువులకు వివరించారు. వారి అంగీకారంతో అవయవదానానికి ఏర్పాట్లు చేశారు.
మియాట్ ఆసుపత్రికి 17 కిలోమీటర్ల దూరం ముగప్పేర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఒక రోగి గత కొన్నాళ్లుగా గుండెమార్పిడి కోసం ఎదురుచూస్తున్నాడు. రెండు వైద్యశాలల వైద్యులు గుండె మార్పిడికి సిద్ధమయ్యూరు. నగర పోలీస్ కమిషనర్ సాయంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా దారిపొడవునా వంద మంది కానిస్టేబుళ్లను బందోబస్తు ఉంచారు. సోమవారం అర్ధరాత్రి 12.50 గంటలకు మియాట నుంచి గుండెతో అంబులెన్స్ బయలుదేరి 17 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి కేవలం 8 నిమిషాల్లో చేరింది.
ముగప్పేర్‌లో సిద్ధంగా ఉన్న వైద్యులు ఆగమేఘాలపై గుండెను అమర్చి అతనికి ప్రాణంపోశారు. షీబా నుంచి సేకరించిన కళ్లను శంకర్ నేత్రాలయ ద్వారా మరో ఇద్దరికి అమర్చారు. ఆమె రెండు కిడ్నీలను మరో ఇద్దరికి అమర్చారు, లివర్ మరొక రోగికి అమర్చి ఆమెను చిరంజీవిగా చేశారు. షీబా మరణించినా ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు