టెస్ట్ ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా మళ్లీ నెంబర్ వన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టెస్ట్ ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా మళ్లీ నెంబర్ వన్

హషీమ్ ఆమ్లా కెప్టెన్ గా తన తొలి సిరీస్ లోనే దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శ్రీలంకతో సోమవారం ముగిసిన రెండో టెస్ట్ ను దక్షిణాఫ్రికా డ్రాగా ముగించగలిగింది. దీంతో రెండు టెస్ట్ ల ఈ సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-0 తో సొంతం చేసుకుంది. శ్రీలంక గడ్డపై 21 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ విజయాన్ని ఆమ్లా కెప్టెన్ గా మొదటి ప్రయత్నంలోనే అందించాడు. రెండో మ్యాచ్ లో ఓటమి ఖాయమనుకున్న దక్షిణాఫ్రికా అసమాన పోరాటంతో మ్యాచ్ ను డ్రా చేసుకోగలిగింది. 369 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు ఓ దశలో 148 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే... టెయిలెండర్లు ఫిలాండర్, ఇమ్రాన్ తాహిర్ లు చివరి తొమ్మిది ఓవర్లు శ్రీలంక బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొని వారి విజయానికి అడ్డుపడ్డారు. ఈ సిరీస్ విజయంతో దక్షిణాఫ్రికా... ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది.

More Telugu News