ఇండియన్ బ్యాట్స్ మెన్ కు ఛాలెంజ్... పటిష్ఠ స్థితిలో ఇంగ్లండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇండియన్ బ్యాట్స్ మెన్ కు ఛాలెంజ్... పటిష్ఠ స్థితిలో ఇంగ్లండ్

భారత్ ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ప్రస్తుతానికి ఇంగ్లండ్ పైచేయి సాధించింది. రెండో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ మరింత చెలరేగిపోవడంతో ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 569 పరుగుల భారీ స్కోర్ చేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తొలి రోజు సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న బ్యాలెన్స్ తో పాటు ఇయాన్ బెల్ కూడా 150 ప్లస్ స్కోరు చేయడం... తొలి టెస్ట్ ఆడుతున్న జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 14 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 25 పరుగులు సాధించింది. పేలవ ఫామ్ తో విమర్శల పాలవుతున్న శిఖర్ ధావన్ తక్కువ స్కోర్ కే అవుటై మరోసారి నిరాశపరిచాడు. టాప్ ఆర్డర్ మూడో రోజు అద్భుతంగా ఆడితేనే... మూడో టెస్ట్ లో ఇండియన్ టీం నిలబడగలదు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ అతి పేలవంగా ఆడితే తప్ప, ఇండియా ఈ మ్యాచ్ గెలవడం అసాధ్యమని లిటిల్ మాష్టర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

More Telugu News