భద్రాచలం డివిజన్ గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భద్రాచలం డివిజన్ గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ

ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ లోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రపదేశ్ కు బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి నిన్న ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం... బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు మండల్లోని గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ లోకి వెళతాయి. అలాగే కూనవరం, చింతూరు, వీఆర్ పురం మండలాలు, భద్రాచలం పట్టణం మినహా మిగిలిన భద్రాచలం మండలం మొత్తం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వెళతాయి. దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు విస్తృత ప్రచారం కల్పించాలని... ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని ఏపీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఆదేశాలు జారీ చేశారు. 30 రోజుల వ్యవధిలో ప్రజల అభ్యంతరాలను పూర్తి స్థాయి నివేదిక రూపంలో రెవెన్యూ శాఖకు అందజేయాలని ఆదేశించారు.

More Telugu News