Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలి: మంత్రి మాణిక్యాలరావు

టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కోరారు. బహిరంగంగా కోరినా ఆయన పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేరన్నారు. దేవాదాయ భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేమని... ఆర్టీఐ పరిధిలోకి దేవాదాయ శాఖను తీసుకోస్తామనీ అన్నారు. దేవాలయాలకు చెందిన ఆస్తులు, అప్పులతో త్వరలో ఓ వెబ్ సైట్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక తిరుమలలో రూ.300 టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది అమల్లోకి రాగానే వీఐపీ లేఖల నిర్మూలన చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

More Telugu News