భూమండలంపై కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన రాక్షల బల్లులను నేడు మనం శిలాజాల రూపంలో, అదీ, ఎంతో అరుదుగా చూస్తున్నాం. ఒకప్పుడు వాటిదే రాజ్యం. ఇప్పుడున్నంత జీవ వైవిధ్యం అప్పుడు లేకపోవడానికి ఈ డైనోసార్లే కారణం. తమ అపారబలంతో మరో జీవిని ఎదగకుండా చేశాయి. దీంతో, జీవకోటి మధ్య సమతుల్యత దెబ్బతిన్నది. ఆ రాక్షస బల్లుల ప్రాభవం అలాగే కొనసాగి ఉంటే నేడు మనిషన్నవాడు భూమిపై ఉండేవాడు కాదేమో. కానీ, నేల రాలిన ఓ భారీ గ్రహశకలం డైనో యుగానికి చరమగీతం పాడింది.
66 మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన అనంతరం రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఆ గ్రహశకలం భారీ వేగంతో నేలరాలిన సందర్భంగా సముద్రాల్లో సునామీలు వచ్చాయి. భూకంపాలు సంభవించాయి. తీవ్రస్థాయిలో ఉష్ణం వెలువడింది. ఆమ్ల వర్షాలూ కురిశాయి. ఆ గ్రహశకలం భూమిని తాకగా, అప్పుడు రేగిన ధూళి సూర్యుణ్ణి సైతం కప్పేసింది.
ఆ ధూళి ఓ దుప్పటి మాదిరిగా భూవాతావరణం పైన నిలిచిపోయింది. తద్వారా సూర్యరశ్మి సోకక భూమి తాత్కాలికంగా చల్లబడిపోయింది. దీంతో, మొక్కలు జీవక్రియలకు ఆటంకం ఏర్పడి అవి చనిపోగా, వాటిపై ఆధారపడిన కొన్ని జంతువులు నాశనమయ్యాయి. ఇలా డైనోసార్లు కూడా కాలగర్భంలో కలిసిపోయాయని బ్రిటన్‌లోని ఎడింబర్గ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం మెక్సికో దేశం ఉన్న ప్రాంతంలో ఆ గ్రహశకలం భూమిని తాకినట్టు ఎడింబర్గ్ పరిశోధకులు పేర్కొన్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు