కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారా? శస్త్రచికిత్స జరిగిందా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారా? శస్త్రచికిత్స జరిగిందా?

డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారా? సింగపూర్ లో చికిత్స పొందారా? అవుననే భావిస్తోంది తమిళ మీడియా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం, పార్టీలో కొంతమంది జంప్ జిలానీలు తయారు కావడం ఆయను మనోవేదనకు గురిచేసిందని సమాచారం. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన చికిత్స పొందారు. అనంతరం తన సతీమణి ప్రేమలతతో కలసి ఈనెల 13న సింగపూర్ వెళ్లారు. ఈ పర్యటన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. రెండు వారాల పాటు సింగపూర్ లో ఉన్న కెప్టెన్ చెన్నై తిరుగుప్రయాణం అవుతున్నారని శనివారం సమాచారం అందింది. అదే రోజు చెన్నై రావాల్సి ఉన్నా... ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఆదివారం ఉదయం చెన్నై వచ్చారు. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు మీనంబాకం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉదయం 10.10కి సిల్క్ ఎయిర్ వేస్ విమానం చెన్నైలో ల్యాండ్ అయింది. అయితే కెప్టెన్ భార్య ప్రేమలత మాత్రమే తొలుత బయటకు వచ్చారు. విజయకాంత్ రాలేదని సూచించడానికే ఆమె ఒక్కరే బయటకు వచ్చారు. అయినా మీడియా అక్కడే వేచి ఉంది. కాసేపటి తర్వాత విజయకాంత్ ను వీల్ ఛైర్ లో సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. అతని శరీరంపై దుప్పటి కప్పి ఉంది. మీడియా కంటపడకుండా కారులోకి ఎక్కించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇదంతా మీడియాకు తెలిసిపోయింది. అయితే, విజయకాంత్ కు ఏమయిందన్న విషయం పార్టీ వర్గాలకు కూడా తెలియని పరిస్థితి. విజయకాంత్ కు సింగపూర్ లో శస్త్రచికిత్స జరిగిందన్న వదంతులూ వ్యాపిస్తున్నాయి. వీల్ చెయిర్ లో రావడంతో ఈ వదంతులకు బలం చేకూరుతోంది.

More Telugu News