స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారవేత్తలకన్నా నెలనెలా క్రమం తప్పకుండా జీతాలు అందుకునే ఉద్యోగులనే బ్యాంకులు నమ్మకస్తులుగా భావిస్తున్నాయని భారతదేశ ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తేల్చిచెప్పింది. వ్యాపారవేత్తలకు అందే ఆదాయంలో స్థిరత్వం ఉండదు కాబట్టి రుణాలు ఎగవేసే అవకాశాలు అధికమని ఆర్థిక సంస్థలు భావిస్తున్నాయి.
వేతన జీవులకు నెలనెలా కచ్చితంగా సొమ్ము అందుతుంది, దీని ఫలితంగా రుణాల ఎగవేతకు తక్కువ అవకాశాలు ఉంటాయని బ్యాంకులు భావిస్తున్నాయి. అందుకే ఉద్యోగులకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్ సంస్థ తెలిపింది. వేతన జీవులకంటే... వ్యాపారవేత్తలు రుణాల ఎగవేత అవకాశాలు 50 శాతం అధికంగా ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ తెలిపింది.
ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు... వ్యాపారవేత్తల రాబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇలాంటప్పుడు రుణాల ఎగవేతకు ఎక్కువ అవకాశాలున్నాయని వెల్లడించింది. వ్యాపారవేత్తల పట్ల ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉంటాయని, ఉద్యోగులకు అమలు చేసే వడ్డీ రేటు కంటే 0.5 శాతం అధికంగా అమలు చేస్తాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ పేర్కొంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు