టీడీపీని దించాలని కోర్టులో కేసు వేస్తా: చాంద్ బాషా
రంజాన్ మాసం తరువాత టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తానని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ నేత చాంద్ బాషా హెచ్చరించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, వాగ్దానాలు అమలు చేయని ప్రభుత్వాన్ని గద్దెనుంచి దించాలని వ్యాజ్యంలో కోరతానని అన్నారు. రాష్ట్ర జనాభాలో ఎనిమిది శాతం ఉన్న ముస్లింలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కక్ష పెంచుకున్నారని ఆయన ఆరోపించారు. బాబు కంటే కేసీఆర్ వెయ్యరెట్లు నయమని ఆయన అభిప్రాయపడ్డారు.