ఒక్కోసారి అలాగే జరుగుతుంటుంది! వెండితెరపై కనిపించిన దృశ్యమే మన జీవితంలో నిజమవుతుంది. 90లలో వచ్చిన 'జడ్జిమెంట్' సినిమాలో జరిగినట్టే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే, సినిమాలో పాపకోసం తల్లులిద్దరు కోర్టుకెక్కగా, ఇక్కడ తండ్రులిద్దరు న్యాయపోరాటం చేస్తున్నారు. వివరాల్లోకెళితే... 2007 వరుస బాంబు పేలుళ్ల ఘటన ఫాతిమా అనే పాపను అనాథను చేసింది. మూడున్నరేళ్ల ఫాతిమా తండ్రితో కలిసి హైదరాబాద్ కోఠీలో గల గోకుల్ ఛాట్ కు వెళ్లింది. అప్పుడే సరిగ్గా బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
తండ్రి కనిపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఫాతిమాను పాపాలాల్ రవికాంత్, జయశ్రీ అనే హిందూ దంపతులు చేరదీశారు. ఫాతిమా పేరును అంజలిగా మార్చి పెంచుకుంటున్నారు. ఇంతలో వారికి సంతానం కలిగింది. అంజలి తమ ఇంట కాలుమోపిన వేళావిశేషం అంటూ పాపను అదృష్టదేవతగా భావించి మరింత అపురూపంగా పెంచుకుంటున్నారు. ఏడేళ్లు గడిచిన తరువాత అంజలి తండ్రినని అత్తాపూర్ కు చెందిన సయీద్ యూసఫ్ జూన్ 30న పోలీసులను ఆశ్రయించి, తన కుమార్తెను తనకు అప్పగించాలని కోరాడు.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల తరువాత తన కుమార్తె ఫోటో టీవీలో చూసి గుర్తుపట్టానని, పేదరికం కారణంగా ఇంత కాలం వెతకలేదని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఫాతిమా అతని కుమార్తె అవునో?, కాదో? తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతికోసం పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, ఇన్నాళ్లూ కుమార్తెను గాలికొదిలేసిన తండ్రి, ఇప్పుడు అకస్మాత్తుగా ఊడిపడి కావాలంటే ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని అంజలి పెంపుడు తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. మరి, ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో?
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు