1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికత అంశంపై రాజ్యాంగ సంక్షోభం సృష్టించొద్దన్నారు. ఈ విషయంలో స్థానికులు, స్థానికేతరులుగా చూస్తూ ఇంకా ఆయన ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని చెప్పారు.
ఈ మేరకు హైదరాబాదులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. తెలంగాణ వాటికన్ సిటీ కాదన్న గంటా, లక్షకోట్లతో రాజధాని నిర్మించుకుంటామన్న వారు బోధనారుసుం చెల్లించుకోలేరా? అని అడగటానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. లక్షకోట్లతో కాకపోతే ఐదు లక్షలకోట్లతో రాజధాని నిర్మించుకుంటామని చెప్పారు.
ఇచ్చిన హామీలనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఆయనిలా మాట్లాడుతున్నారన్నారు. రేపే ఢిల్లీ వెళ్లి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిని కలసి పరిస్థితిని వివరిస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్ పై రాజకీయం చేయడం తగదని, కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నానన్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు