పవిత్ర యుద్ధం పేరిట భారత్ సహా, ఇతర ఇస్లామేతర దేశాలపై దాడులకు తెగబడుతున్న ఆల్ ఖైదా, తాజాగా భారత్ పై ఆఖరి పోరాటానికి సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలు వెల్లడవుతున్నాయి. నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు భారత్ పై జరపనున్న దాడుల్లో ఈ ఉగ్రవాద సంస్థ తాలిబన్, ఇండియన్ ముజాహిదీన్, హిజ్బుత్ తెహ్రిర్ తదితర ఉగ్రవాద సంస్థల సహకారం తీసుకుని విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నుతోందని తెలుస్తోంది. ఇప్పటికే కాశ్మీర్ తరహా ప్రాంతాల్లోని యువతను తమవైపు తిప్పుకునే విషయంతో ఆల్ ఖైదా కొంతమేర విజయం సాధించినట్లే కనిపిస్తోంది. గతేడాది ‘వెల్ కమ్ తాలిబాన్’ అంటూ కాశ్మీర్ లోని హరి పర్బత్ కోటపై రాతలూ దర్శనమిచ్చాయి. అంతేకాక శ్రీనగర్ లో ఏకంగా తాలిబాన్ జెండానే రెపరెపలాడిన వైనం ఆందోళనకు గురిచేసేదే. ఇప్పటికే ముంబై తదితర నగరాల్లోని యువతను కొందరు వ్యాపారులు ఉద్యోగాల పేరిట విదేశాలకు పంపుతూ ఉగ్రవాదుల పంచన చేరేలా ప్రోత్సహిస్తున్నారు.
ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ ఐఎం ఉగ్రవాది యాసిన్ భత్కల్ విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఆల్ ఖైదా ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో నడుస్తున్న ’అజాన్‘ సామాన్యులెవరికీ కనిపించదు. ఎప్పటికప్పుడు పాస్ వర్డ్ లను మార్చుకుంటూ సంస్థలోని వ్యక్తులు, అనుబంధ సంస్థలకు కీలక సమాచారాన్ని చేరవేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. ఈ పత్రిక బోధనలతో పలువురు యువకులు ఉగ్రవాదం వైపు మళ్లుతున్నారు. ఈ పరంపర మరింత వేగంగా విస్తరిస్తున్నట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. ఈ విషయం వాస్తవమేనన్నట్లు ఇప్పటికే కాశ్మీర్ లో తమ కార్యాలయాలు తెరిచామని తాలిబన్లు ప్రకటించారు. ‘గజ్వా-ఏ-హింద్’ పేరుతో ఆల్ ఖైదా తీవ్రవాదులు వ్యవహరిస్తున్న 'భారత్ పై ఆఖరి పోరు'ను పునాదిలోనే అణచివేసేందుకు భారత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు