బీసీసీఐ మధ్యంతర అధ్యక్షుడు శివలాల్ యాదవ్ ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా బీసీసీఐ పగ్గాలు సంతోషంగా అప్పగిస్తానని పేర్కొన్నారు. శ్రీనివాసన్ మరలా భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తానని తెలిపారు. చెన్నైలో తమిళనాడు క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో శివలాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐసీసీ అధిపతిగా శ్రీనివాసన్ ఎన్నిక కావడం హర్షణీయమని పేర్కొన్నారు.
శ్రీనీపై అవినీతి ఆరోపణలన్నీ కేవలం మీడియాలోనే వింటున్నామని పరోక్షంగా వార్తా మాధ్యమాన్ని విమర్శించారు. ఆయన చలవతో టెస్టు క్రికెటర్లే కాకుండా, రంజీ క్రికెటర్లూ లాభపడుతున్నారని ఈ హైదరాబాదీ వివరించారు. ఎంతోమంది బీసీసీఐ అధ్యక్షులుగా పనిచేశారని, పదవీకాలం ముగియగానే వెళ్ళిపోయారని... అయితే, వారందరిలో శ్రీనివాసన్ ప్రత్యేకమని శివలాల్ కొనియాడారు. దేశవాళీ క్రికెటర్లు నేడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి శ్రీనీ తీసుకున్న చర్యలే కారణమని చెప్పారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు