హైదరాబాదు నగరంలో ప్రస్తుతం రంజాన్, బోనాల సీజన్ నడుస్తోంది. దీంతో, ఆయా మత విశ్వాసాల ప్రకారం ప్రజలు ఇళ్ళలో భోజనాలు చేయడం తక్కువ. ముస్లింలైతే హలీం కోసం హోటళ్ళ బాటపడతారు. హిందువులు ఆలయాల వద్దే భోజనాలు చేస్తారు. సీజన్ పరంగా చూసినా, ఓవరాల్ గా చూసినా హైదరాబాదులో హోటళ్ళకు గిరాకీ ఎప్పుడూ ఉండేదే. కానీ, అక్కడ ఆహార నాణ్యత నాసిరకంగా తయారవుతోంది. తనిఖీ చేయాల్సిన ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. నగరంలో 15,000 హోటళ్ళు ఉండగా, వాటిని తనిఖీ చేయాల్సిన అధికారులు వందల్లో ఉంటారనుకుంటే పప్పులో కాలేసినట్టే. కేవలం ఇద్దరితోనే సరిపెట్టుకొస్తోంది జీహెచ్ఎంసీ.
రిజిస్టర్ అయిన హోటళ్ళ సంఖ్య 5,800 కాగా, అనధికారిక హోటళ్ళ సంఖ్య 10,000 వరకు ఉందట. ఇన్నేసి హోటళ్ళకు 10 నుంచి 15 వరకు ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అవసరమవుతారని జీహెచ్ఎంసీ ఫుడ్ అండ్ శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ రవి కిరణ్ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకముందే కొత్త సర్కారు ఫుడ్ ఇన్ స్పెక్టర్ల నియామకం చేపడుతుందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు