ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఒక్క చంద్రబాబే కాదు... ఇరుగుపొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు తాను గౌరవం ఇస్తానని అన్నారు. చంద్రబాబు రాసిన లేఖకు స్పందించలేదన్న ప్రశ్నకు సమాధానంగా కేసీఆర్ ఈ వివరణ ఇచ్చారు.