దసరాకల్లా కల్లు కాంపౌండ్ లను ఏర్పాటు చేస్తాం: కేసీఆర్
3,620 పోలీసు కానిస్టేబుళ్లను నియమించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. రూ.340 కోట్లతో జంటనగరాల్లో పోలీస్ పెట్రోలింగ్ కు కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని ఆయన అన్నారు. పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. జంటనగరాల్లో కల్లు దుకాణాలను తెరుస్తామన్నారు. దసరా పండుగకల్లా హైదరాబాదులో కల్లు కాంపౌండ్ లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదులో సామాన్యుల బతుకులను చిదిమేస్తున్న పేకాట క్లబ్బులను మూసివేయాలని తాను స్వయంగా ఆదేశాలు జారీ చేశానని కేసీఆర్ తెలిపారు.