టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు, తనకు మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలను సీనియర్‌ నేత జానారెడ్డి ఖండించారు. పొన్నాలతో తనకు ఎలాంటి విభేదాల్లేవని ఆయన స్పష్టం చేశారు.'అధికారం లేక మేమేడుస్తుంటే ఇక ఆధిపత్య పోరెక్కడది..?' అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. పొన్నాలను సంప్రదించే తాను సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని... తమ పార్టీలో ఒకరిపై ఒకరు పెత్తనం చేయడం ఉండదనీ అన్నారు. వచ్చే నెలలో తలపెట్టిన పీసీసీ సమీక్షా సమావేశాన్ని పొన్నాల ప్రకటిస్తారని జానారెడ్డి తెలిపారు.