మా ‘సిరు’లను మాకివ్వరూ!: సిరి గోల్డ్ బాధితులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా ‘సిరు’లను మాకివ్వరూ!: సిరి గోల్డ్ బాధితులు

సిరి గోల్డ్ పేరుతో కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఎండీ సుందరంను పోలీసులు అరెస్ట్ చేయడంతో బాధితులలో ఆశలు చిగురించాయి. పైసా పైసా కూడబెట్టిన సొమ్మును సిరి గోల్డ్ చేతిలో పెట్టిన బాధితులు, సిరి గోల్డ్ సంస్థ బిచాణా ఎత్తేయడంతో కంగుతిన్నారు. దాదాపు రూ.95 కోట్లను సంస్థ కస్టమర్ల నుంచి వసూలు చేసిందని పోలీసులు చెబుతున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 'సిరి' బాధితులు ఎక్కువగా ఉన్నారు. ‘సిరి’ ఎండీ సుందరం నెల్లూరు జిల్లా బిట్రగుంట వద్దనున్న పొలాన్ని అమ్మబోతూ పోలీసులకు పట్టుబడ్డాడు. సంస్థ వద్ద 172 ఎకరాల భూమి ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల అరెస్టుతో... తాము కట్టిన సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ బాధితులు కోరుతున్నారు.

More Telugu News