గురువారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతోంది. నాటింగ్ హామ్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. దాంతో ఈసారి లార్డ్స్ మైదానంలో జరిగే మ్యాచ్ లో గెలవాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే, 82 ఏళ్లలో భారత్ లార్డ్స్ మైదానంలో ఆడిన మొత్తం 16 మ్యాచ్ లలో... 11 ఓడిపోయింది. మరో నాలుగు డ్రా చేసుకోగా, గెలిచింది మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ లో. 1986లో కపిల్ కెప్టెన్ గా ఉన్న భారత్ జట్టు ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది. ఆ టూర్ లో కపిల్ సేన 2-0తో సిరీస్ నెగ్గడం గమనార్హం. ఇక, 2002లో గంగూలీ సేన ఓటమి పాలవ్వగా, 2007లో ద్రావిడ్ కెప్టెన్సీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. 2011లో ధోనీ సేన ఓటమి పాలయ్యింది.
గురువారం నుంచి జరిగే రెండో టెస్ట్ కోసం కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీతో పాటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్ ప్రాక్టీసులో పాల్గొన్నారు. తొలి టెస్ట్ లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగిన భారత్, లార్డ్స్ లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటోంది. తొలి మ్యాచ్ లో యువ పేసర్లు ఇషాంత్, భువనేశ్వర్, షమీ రాణించారు. ఇక, స్టువర్ బిన్నీ బౌలింగ్ లో ఆకట్టుకోలేకపోయినా, బ్యాటింగ్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ ను ఎదుర్కొనేందుకు ధోనీ సేన సిద్ధమవుతోంది. రెండో టెస్ట్ లో విరాట్ కోహ్లీపై భారత్ ఆశలు పెట్టుకుంది. తొలి మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి తొమ్మిది పరుగులే చేసిన కోహ్లీ ఈసారి నిలకడగా ఆడేందుకు కసరత్తు చేస్తున్నాడు. శిఖర్ ధావన్, విజయ్, పూజారా, రహానే కూడా నెట్స్ లో చెమటోడ్చారు. రెండో టెస్ట్ లో భారత్ విజయం సాధించాలని కోరుకుందాం.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు