మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్రమంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలు ఛారిటీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్న లక్ష్మీ తాజాగా 'టీచ్ ఫర్ ఛేంజ్' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానము, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు మంచు లక్ష్మి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్ హోటల్ లో ఫ్యాషనేట్ సంస్థ మూడు రోజుల క్రితం ఓ ర్యాంప్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కేటీఆర్... మంచు లక్ష్మి సామాజిక సేవను ప్రశంసించారు. ఛాన్స్ లభిస్తే మంచు లక్ష్మి తన కుమార్తె ఫోటోను నగరంలోని అన్ని చోట్ల ఏర్పాటు చేస్తుందని కేటీఆర్ చమత్కరించారు. (సరోగసీ ద్వారా మంచు లక్ష్మి ఇటీవల తల్లి అయ్యింది). ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు క్యాట్ వ్యాక్ చేశారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా ఈ కార్యక్రమంలో ర్యాంప్ పై నడవడం విశేషం.
గతంలో మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ సినిమా షూటింగ్ పై తెరాస నాయకులు, కార్యకర్తలు దాడిచేసినప్పడు మోహన్ బాబు, కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మిని కేటీఆర్ ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు