పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పొందడంపై బీజేపీని నిందించడాన్ని ఆ పార్టీ తెలంగాణ నేత కిషన్ రెడ్డి తప్పుపట్టారు. పోలవరం ముంపు ప్రాంతాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడటమేంటన్నారు. తెలంగాణ వచ్చిన సమయంలో కుటుంబంతో కలసి సోనియాగాంధీ, ప్రధాని నరేంద్ర మోడీని కలసినప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలపై కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.
ఈ మేరకు హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన, మొదట్లో తెలంగాణ వస్తే చాలనుకునే ఆలోచనలో కేసీఆర్, జైపాల్ రెడ్డి ఉన్నారని... ఇప్పుడు బీజేపీని విమర్శించడం సరికాదనీ అన్నారు. అసలు తమపై వ్యాఖ్యానించే నైతిక హక్కు కూడా వారికి లేదన్నారు. బీజేపీ ఆఫీసులపై దాడి కూడా సరైంది కాదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పోలవరం నిర్ణయం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ త్వరగా నిర్వహించాలని, 9.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని కిషన్ రెడ్డి అన్నారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు