మధ్యాహ్నం 12 తర్వాతే నేడు శ్రీవారి దర్శనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మధ్యాహ్నం 12 తర్వాతే నేడు శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో పదకొండు నుంచి పన్నెండు వరకు ఆలయ శుద్ధి జరుగుతుందని వెల్లడించారు. ఆ తర్వాతే దర్శనం మొదలవుతుందని చెప్పారు. అటు శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం, నడకదారి భక్తులకు ఐదు గంటల సమయం పడుతోంది.

More Telugu News