ఇకపై ఇంటర్ చదివితే చాలు బీఈడీ చేయొచ్చు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇకపై ఇంటర్ చదివితే చాలు బీఈడీ చేయొచ్చు

డిగ్రీ చదివిన తర్వాత బీఈడీ చేస్తాం... మనకు ఇంతవరకు తెలిసింది ఇదే. ఇకపై బీఈడీ చేయాలనుకునేవారు డిగ్రీ చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్ పూర్తి చేసి ఎంచక్కా బీఈడీలో చేరిపోవచ్చు. ఇప్పటికే, నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్) నిబంధనల మేరకు బీఈడీని మార్చాలని అన్ని విశ్వవిద్యాలయాలకు యూజీసీ ఆదేశాలు జారీచేసింది. ఈ నిబంధనల ప్రకారం డిగ్రీతో సమానంగా బీఈడీ ఉంటుంది. కొత్త బీఈడీ కోర్సులకు అవసరమైన సిలబస్ ను యూజీసీ ఇప్పటికే తయారు చేస్తోంది.

More Telugu News