తాను ముమ్మాటికీ టీడీపీ కుటుంబసభ్యుడినే అని ప్రకాశం జిల్లాపరిషత్ ఛైర్మన్ హరిబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి ఛైర్మన్ అయ్యానని చెప్పారు. ఉప ఎన్నిక సమయంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని... అయితే జిల్లాలోని కొంతమంది నేతలు తనను ఛైర్మన్ కాకుండా అడ్డుకోవాలని యత్నించారని మీడియాతో అన్నారు. తన ఛైర్మన్ అవకాశాలకు గండి పడే అవకాశం ఉండటంతో... విధిలేని పరిస్థితుల్లోనే, స్వతంత్రుడిగా ఛైర్మన్ బరిలోకి దిగానని వెల్లడించారు. జిల్లా టీడీపీ నేతల దగ్గరకు ముగ్గురు జడ్పీటీసీలు వస్తే... తాను ఏకంగా 27 మందిని తెచ్చుకున్నానని చెప్పారు. గెలవాలంటే పక్కవారిని లాక్కోక తప్పని పరిస్థితి... అలాంటప్పుడు నైతిక విలువల ప్రశ్న అవసరం లేదని అన్నారు. వైకాపా మద్దతుతో హరిబాబు ప్రకాశం జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే.
జరిగిన ఘటనలపై త్వరలోనే అధినేత చంద్రబాబును కలసి వివరణ ఇస్తానని ఈ సందర్భంగా హరిబాబు తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాలన్నా, పూలమాల వేయాలన్నా కేవలం తనకు మాత్రమే అర్హత ఉందని చెప్పారు. అయితే, జిల్లాలోని నాయకులెవరికీ తాను వ్యతిరేకం కాదని... సీనియర్ నేతలు కరణం బలరామ్, మంత్రి శిద్దా రాఘవరావు అంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపారు. త్వరలో జరిగే కళాపరిషత్తు ఉత్సవాలకు వీరిని ఆహ్వానిస్తానని చెప్పారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు