తిరుపతిలో దొంగలు బాబోయ్... దొంగలు
తిరుపతి నగరంలో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో గొలుసు దొంగతనాలు పెరిగిపోవడంతో బయటకు వెళ్లాలంటేనే తిరుపతివాసులు భయపడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లే మహిళల మెడలో బంగారు ఆభరణాలను చైన్ స్నాచర్లు మాయం చేస్తున్నారు. ఈ మధ్య మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చోరీల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా... దొంగతనాలను నివారించడంలో విఫలమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. పోలీసు శాఖ దీనిపై దృష్టి సారించి దొంగతనాలను అరికట్టాలని వారు కోరుతున్నారు.