ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర మిశ్రా నియామకానికి అడ్డుచెబుతున్న ట్రాయ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఇక రాజ్యసభ ఆమోదం ఒక్కటే తరువాయిగా మిగిలింది. నిన్నటిదాకా ఈ సవరణ బిల్లుపై విమర్శలు గుప్పించిన బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ లతో పాటు ఎన్సీపీ కూడా రెండు రోజుల్లోనే స్వరం మార్చింది. దీంతో, ఈ విషయంలో కాంగ్రెస్ ఒక్కటే ఉభయ సభల్లో ఏకాకిగా మిగిలింది. తనకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసే అధికారిని ఎంచుకునే సంపూర్ణ అధికారం ప్రధానికి ఉందని తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయపడింది.
మరోవైపు, ఈ విషయంలో ప్రధానికి ఆమాత్రం స్వేచ్ఛ లేకపోతే ఎలాగంటూ బీఎస్పీ, ఎన్సీపీలు కూడా బీజేపీ నిర్ణయానికి మద్దతు తెలపాయి. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ తో పాటు సీపీఎం సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, సభ నుంచి వాకౌట్ చేశారు. మిగిలిన పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఉండటంతో సభ బిల్లుకు ఆమోదం తెలిపింది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు