దేశంలోని తొలి క్యాథలిక్ టీవీ చానల్ 'షాలోం'కు చెందిన క్యాథలిక్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీని నిజమైన దైవ సేవకుడిగా అభివర్ణిస్తోంది. మోడీ ప్రధాని కావాలన్నది దేవుని నిర్ణయమని, దానికి క్రైస్తవులందరూ కట్టుబడి ఉంటారని ఆ పత్రిక తన తాజా ఎడిషన్ సంపాదకీయంలో పేర్కొంది. భగవంతుడు తాను సృష్టించగలిగిన మంచితనాన్నంతా మోడీ సర్కారు ద్వారా వెల్లడి చేయదలిచాడని ఆ పత్రిక తెలిపింది.