వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభం.. 12 గంటలవరకు వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభం.. 12 గంటలవరకు వాయిదా

పదిహేను నిమిషాల వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయిద్ ను భారత జర్నలిస్టు, రాందేవ్ బాబా అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ కలిసి ఇంటర్వ్యూ చేయడంపై సభ మొదలైన వెంటనే విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు సహా అందరూ వ్యతిరేకించారు. ముంబై పేలుళ్ల నిందితుడిని దేశానికి చెందిన ఓ వ్యక్తి కలవడం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఒకవేళ ప్రభుత్వ అనుమతితోనే కలిశారా? అని అడిగింది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో సభలో గందరగోళం నెలకొనడంతో డిప్యూటీ ఛైర్మన్ హమీద్ అన్సారీ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

More Telugu News