జమ్మలమడుగు మున్సిపాలిటీ వైకాపా కైవసం
పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఎన్నికల్లో... జమ్మలమడుగు మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ గా వైకాపాకు చెందిన తులశమ్మ ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన ముల్లా జానీ గెలుపొందారు. టీడీపీ, వైకాపా రెండింటికీ సమాన సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో... రిటర్నింగ్ అధికారి లాటరీ తీశారు. లాటరీలో ఛైర్మన్ పదవిని వైకాపా గెలుపొందింది.